24.6 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మల్లన్న ప్రభోత్సవం

ప్రసిద్ధ శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. అశేష జనవాహిని మధ్య శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లిఖార్జునస్వామి ప్రభోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన కన్నడిగులతో శ్రీశైల ప్రధాన రహదారులు కిటకిటలాడాయి. ప్రభోత్సవాన్ని కన్నులారా చూసేం దుకు భక్తులు పోటీ పడ్డారు. హరహర మహాదేవ శంభో శంకర… ఓం నమః శివాయ నామస్మరణలు మిన్నంటాయి.

పురందేశ్వరికి నిరసన సెగ

రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కూటమి అభ్యర్ధి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురం శ్వరికి నిరసన సెగ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన ఆత్మీయ సమావేశం ఇందుకు వేదిక కాగా బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడం వివాదానికి కారణమైంది. ఫ్లెక్సీని తొలగించి బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సమసిపోలేదు. దీంతో పురందేశ్వరి సమా వేశం నుండి వెనుదిరిగారు.

పరస్పరం ఒప్పందం

కృష్ణాజిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్‌ ఆశించి భంగపడ్డ కోన నాగార్జున పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. జిల్లా, రాష్ట్రానికి చెందిన నేతలిద్దరు పరస్పర అంగీకారంతో టిక్కెట్లు అమ్ముకున్నారని, ఇందుకు తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేసారు. ఎలక్షన్ ఫండ్ లో సగ భాగం ఇవ్వాలని షరతు పెట్టారన్న నాగార్జున టికెట్‌ విషయమై పునరాలోచన చేయకపోతే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానంటూ హెచ్చరించారు.

త్రివేణి సంగమం

టీడీపీ,బీజేపీ, జనసేన పొత్తు పవిత్రమైన త్రివేణి సంగమం లాంటిదన్నారు అనంతపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్ధి అంబికా లక్ష్మీనారాయణ. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు. పరిపాలన కుంటుపడేలా చేసి, దేశంలో అత్యంత వెనుకబడి రాష్ట్రంగా ఏపీని తీర్చిది ద్దిన ఘనాపాటి జగన్‌ అంటూ ఎద్దేవా చేసారు. అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ ప్రభు త్వాన్ని ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి కొట్టాలని కోరారు.

అన్ని హంగులతో….

ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భవనాన్ని అన్ని హంగులతో అద్భుతంగా నిర్మించి ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండే పాత్రికేయుల కోసం అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇస్తామని తెలిపారు.

అవగాహన కార్యక్రమం

హైదరాబాద్‌ GHMC పరిధిలోని మక్కా మసీదు వద్ద ఓటర్ల అవగాహన కార్యక్రమంను నిర్వహించారు అధికారులు. GHMC కమీషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, జిల్లా కలెక్టర్‌, రిటర్నింగ్‌ అధికారి అనుదీప్‌, జాయింట్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరగాలన్న అధికారులు, ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సెల్‌ఫోన్స్‌ నిషేధం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయంలోనికి సెల్‌ఫోన్లను నిషేదించారు. ఈ మేరకు ఆలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేసారు. భక్తులతోపాటు ఆలయ సిబ్బందికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు. సెల్‌ఫోన్లు భద్రపర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు భక్తులు ఐదు రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటోందన్నారు.

పోటెత్తిన కన్నడ భక్తులు

    శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు తరలివస్తున్న కన్నడ భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతు న్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రాతఃకాల పూజలు అనంతరం కన్నడ భక్తులను దర్శనాలకు అనుమతిస్తోంది దేవస్ధానం. స్పర్శదర్శనం పూర్తిగా నిలుపుదల చేసిన అధికా రులు స్వామివారి అలంకార దర్శనంకు మాత్రమే అనుమతిస్తున్నారు. భక్తులకు నిరంతరం అల్పాహా రం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. కన్నడ భక్తులు శ్రీ భ్రమరాంబికాదేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు.

నిత్యావసర సరుకులు అందజేత

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హాజరత్ టిప్పు సుల్తాన్ కిద్మిత్ టీం నిరుపేద ముస్లిం మైనార్టీ కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేసింది. సుమారు 120 ముస్లిం మైనార్జీ కుటుంబాలకు రంజాన్‌ పండుగను పురస్కరించుకుని వీటిని పంపిణీ చేసారు. పీఆర్టీ వీధిలోని మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ.. పేదప్రజలకు చేయూతనందించడమే టీం ముఖ్య ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.

అరుదైన రికార్డ్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేయర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. ముస్తాఫిజుర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో అయ్యర్‌ ఇచ్చిన క్యాచ్‌ పట్టుకోవడంతో ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. విరాట్‌ కోహ్లీ 110 క్యాచ్‌లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వెయ్యి పరుగులు, వంద వికెట్లు, వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా జడేజా రికార్డు నెలకొల్పాడు.

ఆ టీం ఇదే….

తెలంగాణను మోసం చేసిన దగాకోరు టీం ఇదే…నంటూ BRS నేతలపై తెలంగాణ బీజేపీ చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్‌ నేతల ఫోటోలతో కూడిన ఓ టీం ఫోటోను ఇందుకు జత చేసింది. ఈ టీం కెప్టెన్‌ కేసీఆర్‌ అంటూ టీ బీజేపీ పేర్కొంది. వైస్‌ కెప్టెన్‌ కేటీఆర్‌.. ఆల్‌ రౌండర్‌ లుగా కవిత హరీష్‌రావు, పల్లాను పేర్కొంది. రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, నిరంజన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, బాల్కసుమన్‌, మాజీ స్పీకర్‌ పోచారం, గంగులను బ్యాటింగ్‌, బౌలర్లుగా చూపించింది. ప్రస్తుతం ఈ మార్ఫింగ్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్