పుష్కరఘాట్ వద్ద నీటికుక్కలు
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యామ్ పరిధిలోని శివాలయం పుష్కరఘాట్ వద్ద నీటికుక్కలు స్వైర విహారం చేశాయి. పర్యాటకులను నీటికుక్కలు ఆకట్టుకుంటున్నాయి. అంతరించి పోతున్నాయి అనుకు న్న తరుణంలో రెండేళ్ళ తరువాత సాగర్ జలాశయంలో నీటికుక్కలు కనబడటం విశేషం.
పూలేల విగ్రహాలు ధ్వంసం
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని ఆలిండియా మాలీ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే డిమాండ్ చేశారు. మంచిర్యాల బోరపల్లిలోని మహ నీయుల విగ్రహాలను ధ్వంసం చేయడంపై ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్ లో ‘వ్యూహం’ వాయిదా
‘వ్యూహం’ సినిమా విడుదల మార్చి 1వ తేదీకి, శపథం మూవీ 8కి వాయిదా వేసినట్లు దర్శకుడు రాంగో పాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈసారి కారణం లోకేష్ కాదని సెటైర్ వేశారు. సాంకేతిక కారణాలతో, ఆయా తేదీల్లో అయితే కోరుకున్న థియేటర్లు దొరుకుతున్నందున వాయిదా వేసినట్లు ఆర్జీవీ తెలిపారు.
ఫ్రీ రీడింగ్ సెంటర్ ప్రారంభం
ఉద్యోగ పరీక్షలకు ప్రిపేరవువుతున్న యువతీ యువకుల కోసం ఉచిత రీడింగ్ సెంటర్ ఆసిఫాబాద్ ఎంపీడీఓ కాంప్లెక్స్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ హేమంత్ బోర్ఖడే, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు ఈ రీడింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.
అనుమానాస్పదంగా విద్యార్ధిని మృతి
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ మైనార్టీ పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థిని షేక్ అంజూమ్ మృతిచెందింది. అనారోగ్యానికి గురైన అంజూమ్‌ను స్కూలు సిబ్బంది రెండు రోజుల క్రితం తల్లిదండ్రుల వద్దకు పంపించారు. అయితే.. అంజూమ్ మృతికి స్కూలు సిబ్బంది కారణమని పేరెంట్స్ ఆరోపించారు.
ర్యాపిడో క్యాబ్ మహోత్సవ్
హైదరాబాద్‌లో ర్యాపిడో క్యాబ్ కెప్టెన్‌లను క్యాబ్ మహోత్సవ్ సందర్భంగా ఆ సంస్థ సత్కరించింది. 15 వందల మందికి పైగా క్యాబ్ కెప్టెన్‌లను సత్కరించి, వాషింగ్ మెషిన్లు, టీవీలు, కెమెరాలు అందజేసింది. గత ఏడాది మే నెలలో కార్యకలాపాలు ప్రారంభించిన ర్యాపిడో 50 వేల మంది క్యాబ్ కెప్టెన్‌లను తన సాస్ ఆధారిత ప్లాట్‌ఫాంలో చేర్చుకుంది.
సకల జనుల చైతన్య యాత్ర
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మూడో రోజు సకల జనుల చైతన్య పాదయాత్ర అత్తిలి మండలం ఉనికిలిలో చేశారు. రాధాకృష్ణకు మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. పాదయాత్ర ఆరవల్లి, దంతుపల్లి, కంచుమర్రు మీదుగా మంచిలి వరకు సాగింది.
యువతి బెదిరింపులు
అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ లాయర్, అతడి రెండేళ్ల కూతురి ఫొటోలను న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిం దామె. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
మంగళగిరి అభ్యర్థి ఎవరు ?
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల కార్యాలయాన్ని వైసీపీ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో విజయ సాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళగిరిలో బీసీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డి తీసుకుంటారని విజయసారెడ్డి ప్రకటించారు. ఇంతవరకు మంగళగిరి అభ్యర్థిని ఖారారు చేయని పార్టీ అధిష్టానం.
వైసీపీ కార్యకర్తల దాడి
పల్నాడు జిల్లా యర్రబాలెం వద్ద సత్తెనపల్లి వాసి కోటేశ్వరరావుపై నలుగురు వ్యక్తులు వైసీపీ జెండా కర్రల తో దాడి చేశారు. దాడిలో కోటేశ్వరరావు తలకు బలమైన గాయం తగిలింది. క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ చేశారు. మెరుగైన చికిత్స కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కత్తి పోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి జెన్‌పాక్ట్ వద్ద కత్తిపోటుకు గురైన పుస్తకాల సాయికుమార్ గాంధీ ఆసుపత్రిలో మృతిచెందాడు. సికింద్రాబాద్‌కు చెందిన సాయికుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. స్థానికులు సాయికుమార్‌ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయికుమార్ మరణించాడు.
సీఎం సతీమణి యాదాద్రి దర్శనం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం సతీమణి గీతారెడ్డి, కుటుంబ సభ్యులు దర్శించుకున్నా రు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కుటుంబ సభ్యులకు ఆలయ సంప్రదాయ ప్రకారం అర్చకు లు స్వాగతం పలికారు. గర్భాలయంలో వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.