ఎన్నికల సన్నాహక సమావేశం
నల్గొండ పార్టమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో జరిగింది. సమావేశంకు ముఖ్యఅతిధిగా AICC ఇంఛార్జి దీపా దాస్ మున్షి హాజరయ్యారు. దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నియోజకవర్గంగా నల్గొండ నిలవాలని పిలుపునిచ్చారు దీపాదాస్. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొనగా, సమావేశానంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకున్నారు నేతలు.
కోవర్టుల వల్లే…
డబ్బుకు అమ్ముడుపోయిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పది మందిని పార్టీ నుండి సస్సెండ్ చేయాలని డిమాండ్ చేసారు కామారెడ్డి జిల్లా పార్టీ సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్. పార్టీని మోసం చూసి కోవర్టులుగా వ్యవహ రించిన వారి వల్లే అవిశ్వాసం నెగ్గిందన్నారు. మున్సిపల్ చైర్మన్ గా జాహ్నవికి సహాకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ఇంఛార్జి గంగ గోవర్ధన్, పార్టీ జిల్లా అద్యక్షుడు ముజీబోద్దిన్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. బాలశౌరి గెలుపు తధ్యం మచిలీపట్నం ఎంపీ స్ధానానికి కూటమి జనసేన అభ్యర్ధిగా వల్లభనేని బాలశౌరిని ప్రకటించడంపై నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మచిలీపట్నం కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి బాలశౌరి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. బాలశౌరిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ.
తప్పుడు ప్రచారాలు వద్దు
భారత పౌరసత్వ చట్టం గురించి వైసీపీ నాయకులు మసీదులలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టిడిపి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంటులో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి నప్పుడు మద్దతు పలికింది వైసీపీ పార్టీ కాదా అని నందికొట్కూరులో ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో మైనార్టీలకు పూర్తి రక్షణ ఉంటోందని భరోసా ఇచ్చారు బైరెడ్డి.
వీడియో కాన్ఫరెన్స్
ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ అంశంపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ వద్ద ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుతో పాటు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలన్నారు వికాస్‌రాజ్.
రాజేష్‌కు ‘డాక్టరేట్’
విద్యుత్ రంగంలో రావాల్సిన మార్పులపై చేసిన పరిశోధనలకు గాను జేఎన్‌టీయు హైదరాబాద్ ఫ్యాకల్టీ రాజేష్ ఖన్నాకు డాక్టరేట్ దక్కింది. పెరుగుతున్నవిద్యుత్ డిమాండ్ కి అనుగుణంగా సమాజం ఆధార పడ్డ వివిధ పునారుద్పదక ఇందనాలపై రాజేష్ పరిశోధన చేసారు. సోలార్, విండ్ , హైబ్రిడ్ ఎనర్జీ లాంటి డిస్ట్రిబ్యూటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ ద్వారా పవర్ ని ఎలా జనరేట్ చేయాలనేది రాజేష్ తన పరిశోధనల ద్వారా చేసి చూపించగలిగాడు. దీంతో తనకి ఈ గౌవరం లభించింది.
ఘాట్‌రోడ్డులో ప్రమాదం
తిరుమల ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానంతరం తిరుగు పయనమైన బెంగళూరుకు చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారు చెట్టుని ఢీకొట్టడంతో భవాని అనే మహిళ మృతి చెందింది. మొదటి ఘాట్ రోడ్డులో ఎలిపేంట్ ఆర్చి సమీపాన ఈ ప్రమాదం జరిగింది. చికిత్స పొందుతు న్న మృతురాలి కుటుంబసభ్యులను అశ్వని ఆసుపత్రిలో పరామర్శించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి.
బోపన్న జోడీదే ‘టైటిల్’
అమెరికాలో జరిగిన మియామి ఒపెన్ టోర్నీలో రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్‌ల జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్ పోరులో ఇవాన్ డోడిగ్ – ఆస్టిన్ క్రాజిసెక్ జోడీని చిత్తు చేసింది. తొలిసెట్‌ను టై బ్రేకర్‌లో కోల్పోయిన బోపన్నజోడీ ఆ తర్వాత పుంజుకుని మిగిలిన రెండు సెట్లను దక్కిం చుకుంది. ఈ సీజన్‌లో రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ఈ జోడీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
‘క్రికెటర్’ మాండవీయ
కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుక్ మాండవీయ క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లలోని పోరుబందర్ లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంటు బరిలో ఉన్న ఆయన స్ధానిక ఆటగాళ్లతో కలసి క్రికెట్ ఆడారు. 51 ఏళ్ల వయస్సుల్లోనూ యువకులతో పోటీ పడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. లెష్ట్ హ్యండ్ బౌలింగ్, బ్యాటింగ్ చేసి చూపరుల్ని ఆకట్టుకున్నారు. చివరగా తనతో ఆడిన కుర్రాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలియజేసారు.
తెలంగాణలో హీటెక్కిన రాజకీయం
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. జూబ్లీహిల్‌లోని రేవంత్ నివాసంలో కడియం ఫ్యామిలీ తీర్థం పుచ్చుకుంది. దీంతో ఒక్కసారిగా స్టేషన్ ఘనపూర్ నియోజ కవర్గంలోని ధర్మసాగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కడియం చేరికను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నారు. ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. ప్రాణాలైన ఆర్పించి, దళిత ద్రోణిని అడ్డుకుంటామని నినాదాలు చేశారు. ఊహించని పరిణామాలతో నియోజకవర్గంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆత్మహత్యాయత్నం చేసిన వారిని అడ్డుకొని స్టేషన్‌కి తరలించారు.


