34.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

కొత్త నిబంధనలు

అయోధ్య బాలరాముని దర్శనానికి వెళ్తున్న భక్తులు కొత్తగా జారీ చేసిన నిబంధనలు తప్పక పాటించా లని కోరింది ఆలయ ట్రస్ట్‌. మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని పేర్కొంది. స్వామివారికి ఇచ్చే హరతిలో పాల్గొనేందుకు వీలుగా పాస్‌లు ఆన్‌లైన్‌లో ఉంచినట్లు పేర్కొంది. బాల రాముని దర్శనం కోసం లక్షన్నర మంది భక్తులు రోజూ వస్తున్నట్లు ట్రస్ట్‌ పేర్కొంది.

అభివృద్ధి బాట

గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి సీతక్క. ములుగు నియోజకవర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఎంపీగా పోటీ చేస్తున్న బలరాం నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు.

బోగస్‌లపై కసరత్తు

బోగన్‌ రేషన్‌ కార్డుల ఏరివేతపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. అనర్హులకు జారీ అయిన కార్డులను గుర్తించే పనిలో నిమగ్నమైంది. ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులతో అనుసంధానం అయినందున ఆస్తులు, వాహనాల వివరాలను సేకరించనుంది. ఇక జీఎస్టీ నంబర్‌తో వ్యాపారవేత్తలను, ఆధార్‌, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల ఆధారంగా భూస్వాములను సైతం గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

రేషన్‌ బియ్యంకు అడ్డుకట్ట

వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడెం గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి బిన్నీ రైస్ మిల్ నుండి అక్రమంగా తరలిస్తున్న 400 బస్తాల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేయ డంతో పాటు మిల్లు యజమాని ఏకామ్రాచారి పై కేసు నమోదు చేసారు. పట్టుబడ్డ బియ్యం విలువ 7లక్షల 70వేలు వుంటుందన్న పోలీసులు బియ్యాన్ని జిల్లా సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

గాయపడ్డ జింక

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాంపల్లి బైపాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో జింక గాయపడింది. గాయపడ్డ జింక ను గమనించిన స్ధానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖాధికారులు గాయపడ్డ జింకకు చికిత్స చేయించారు.

హిజ్రాల అసభ్య ప్రవర్తన

పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఆటోనగర్ లో హిజ్రాలు హల్చల్ చేసారు. డబ్బులు ఇవ్వాలంటూ షాపు యజమానితో గొడవకు దిగారు. నిరాకరించడంతో షాపు ముందు అసభ్యకరంగా ప్రవర్తించారు. పోలీసులు ప్రవేశించి హిజ్రాలకు సర్ది చెప్పి పంపడంతో గొడవ సద్దుమణిగింది.

మద్యం మత్తులో….

మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేసాడు. 33 kv విద్యుత్ స్తంభం పై ఎక్కి నానా హంగామా సృష్టిం చాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వ్యక్తి చేస్తున్న హంగామాపై స్థానికులు పోలీసు లకు సమాచారం ఇవ్వడంతో వ్యక్తిని కాపాడి తమ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కొవ్వొత్తుల ప్రదర్శన

ట్రోలింగ్‌కు గీతాంజలి బలవడంపై కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ మహిళా విభాగం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ర్యాలీలో వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా వల్లే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడినట్లు పినిపే శ్రీకాంత్‌ ఆరోపించారు.

నిశ్చితార్థ వేడుక

హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరక్‌ల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో జరిగింది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో పలువుర్ని ఆకర్షిస్తున్నాయి. రాజావారు..రాణిగారు సినిమాలో ఈ జోడీ హీరో హీరోయిన్లుగా నటించారు. మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

ఫైనల్స్‌కి ఢిల్లీ క్యాపిటల్స్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ పోటీల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌ను ఓడించింది. ఢిల్లీ ప్లేయర్‌ షెఫాలి వర్మ 71 పరుగులతో చక్కటి ఆటతీరు ను ప్రదర్శించింది. దీంతో లక్ష్యాన్ని 13.1. ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందు కుని ఫైనల్లోకి దూసుకెళ్లింది.

పోలీసు కవాతు

ఎన్టీఆర్ జిల్లా మోడల్ కాలనీ, గొట్టుముక్కల, పరిటాల, నక్కలంపేటలో పారా మిలటరీ దళాలు, పోలీసులు కవాతు చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, పోలీసులకు ప్రజలు సహకరిం చాలని కంచికచర్ల రూరల్ సీఐ చంద్రశేఖరరావు కోరారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద నిఘా ఉంటుం దన్నారు.

Latest Articles

రేపే లోక్‌సభ తొలిదశ పోరు

   రేపు లోక్‌సభ తొలిదశ సమరానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 102 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. 21 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్