తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్ ను విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు కోరుతున్నా రు. గ్రీన్ ఛానెల్ ద్వారా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫండ్ రాకా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఇంక్రి మెంట్లు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. హెల్త్ మినిస్టర్‌తో జనవరిలో చర్చలు జరిపిన జూడాలు.. హెల్త్ మినిస్టర్ భరోసా ఇవ్వడంతో గతంలో సమ్మె విరమించుకున్నారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకపోవడంతో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ రాకుండా ఆగిపోయింది. దీంతో మళ్లీ సమ్మెబాట పట్టారు జూనియర్ డాక్టర్లు.