తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశ ముందని వివరించింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 44.0 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండ, మహబూబ్‌నగర్‌లో 25.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున నమోదైంది. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లాలో 44.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 44.7 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ జిల్లా వయల్పూర్ 44.6 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపారు.