38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

విజయవాడలో వైసీపీకి కాంగ్రెస్ గండం

    ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య ఎన్నికల పోరుతో వైసీపీకి కాంగ్రెస్‌ గండంగా మారింది. జగన్‌పై అసంతృప్తిగా ఉన్న నాయకులంతా ఆ గట్టునున్న షర్మిలవైపు క్యూకట్టేస్తున్నారు. దీంతో వైసీపీ ఓట్లకు భారీగా గండిపడే అవకాశముం డటంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. దీనికి తోడు కడప నుంచి షర్మిల పార్లమెంట్‌ ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జోరందుకోవడంతో వైసీపీ కలవర పడు తోంది.

      ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెట్టి ముందుకు సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష కూటమిల మధ్యే పోరు కొనసాగే అవకాశం ఉంది. అయితే,.. కాంగ్రెస్‌ పుంజుకుంటున్న నేపథ్యంలో వీరిద్దరి ఓట్లకు గండి పడనుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ బలహీనపడింది. పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌.. వైఎస్‌ఆర్‌ కుమార్తె షర్మిలను రంగంలోకి దించింది. పార్టీ పగ్గాలు అప్పజెప్పి జగన్‌ను టార్గెట్ చేసింది. తాము ఊహించినట్టే ఏపీలో హస్తం పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. సొంత అన్నే కదా అని కాస్త కూడా వెనుకడుగు వేయకుండా వైసీపీ వైఫ ల్యాలపై షర్మిల విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. దీంతో ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. అంతేకాదు పక్కపార్టీల నుంచి చేరికలు కూడా జోరందు కున్నాయి.ఈ పరిణామాలతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ కూడా పెరిగే అవకాశముంది. తద్వారా ఇటు వైసీపీ ఓట్లకు గండి పడటంతోపాటు.. అటు ప్రతిపక్ష కూటమికి కూడా నష్టం జరిగే ఛాన్స్‌ ఉంది.

      మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో కడప నుంచి షర్మిలను బరిలో దించాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. అయితే… అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమంటోంది షర్మిల. 2014 నుంచి కడప ఎంపీ స్థానాన్ని వైసీపీనే కైవసం చేసుకుంటోంది. ప్రస్తుతం పరిస్థితులతో షర్మిల కడప ఎంపీగా బరిలోకి దిగితే కనుక.. అధికార పార్టీకి భారీ నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కడప జిల్లా ప్రజలు మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే కడప పార్లమెంటుతోపాటు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఓటు బ్యాంక్‌ కొంత వరకు షర్మిల వైపు వెళ్లే ఛాన్స్‌ ఉంది. కాగా,.. గత ఎన్నికల్లో కడపలోని 10 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంది వైసీపీ.కానీ ఈ సారి ఎన్నికల్లో షర్మిల రూపంలో అధికార పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.

     ఈ ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అధికార పార్టీ మొండి చూయి చూపింది. దీంతో హైకమాండ్‌పై గుర్రుగా ఉన్న నేతలకు కాంగ్రెస్‌ సరైన ఆప్షన్‌లా కనిపించడంతో ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్‌బై చెప్పి హస్తం చేయి పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఎలిజా షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని వైసీపీకి షాక్‌ ఇచ్చారు. చింతలపూడి టికెట్‌ ఆశిస్తున్న ఎలిజా అక్కడ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ ఓట్లకు కొంత మేర గండి పడ్డట్టే. ఇక గతంలోనే నంది కొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సైతం కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. వచ్చే ఎన్నికల్లో అయన తిరిగి అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అయన మొదటి సారి వైసీపీ నుంచి విజయం సాధిం చారు. అయితే ఈ సారి ఆర్థర్ కి వైసీపీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి హస్తంతో జతకట్టారు. ఈయన కోడుమూరు నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. 2009లో మొదటిసారి మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ బలహీనపడటంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. ఇలా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్ గూటికి క్యూ కట్టడంతో వైసీపీకి నష్టం తప్పదంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టు.

Latest Articles

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత

    తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే రేంజ్ లో ఎండలు విజృంభిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్