Fans War | పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో దారుణం చోటుచేసుకుంది. సినిమా హీరోల అభిమానుల మధ్య జరిగిన స్వల్ప వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. ప్రభాస్ ఫ్యాన్ హరికుమార్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కిశోర్ ల మద్య వాట్సాప్ స్టేటస్ విషయంలో స్వల్ప వివాదం తలెత్తింది. అది కాస్తా ముదిరి భారీ ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాస్ ఫాన్ హరికుమార్.. పవన్ కళ్యాణ్ అభిమాని కిషోర్ ని సెంట్రింగ్ కర్రతో కొట్టి చంపాడు. భవనానికి రంగులు వేసేందుకు వచ్చిన హరికుమార్, కిషోర్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.