మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, బీఆర్‌ఎస్‌లో అగ్రనేతకావడంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీ ప్రకంపనలు రేపుతోంది. ఫార్ములా ఈ-రేసులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అలాగే పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఏ2గా, HMDA అప్పటి చీఫ్ ఇంజినీర్ BLNరెడ్డిని ఏ3గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది.
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18న ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి 54 వేల 88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. ఇటీవల గవర్నర్ ఆమోదించడంతో ఈ నెల 17న సాధారణ పరిపాలనశాఖ మెమో జారీ చేయగా.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ DSP మాజిద్ అలీఖాన్ కేసు నమోదు చేశారు.
కేటీఆర్‌పై కేసు నమోదు రాజకీయ కుట్రేనని ఆరోపిస్తోంది బీఆర్‌ఎస్. ఎన్నికల హామీలు అమలు చేయలేని రేవంత్ సర్కార్.. వాటి నుంచి డైవర్ట్ చేసేందుకే ఈ కుట్రలకు పాల్పడుతోందంటున్నారు గులాబీ నేతలు. ఇకపోతే తాను లీగల్‌గా కేసును ఎదుర్కొంటానంటునున్న కేటీఆర్… దమ్ముంటే సభలో ఈ ఫార్ముల రేసుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్. మరోవైపు తనపై వేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ నేడు హైకోర్టును ఆశ్రయించనున్నారు మాజీ మంత్రి. ఈ క్రమంలోనే ఇవాళ క్వాష్ పిటిషన్ వేయనున్నారు.