లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. పట్నం నరేందర్‌రెడ్డిపై నమోదైన 3 FIRలలో రెండు FIRలను హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఘటనలో తనపై మూడు FIRలు నమోదు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు పట్నం నరేందర్‌రెడ్డి. దీనిపై విచారించిన హైకోర్టు..నరేందర్‌రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించింది. మూడు FIRలలో రెండింటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.