Site icon Swatantra Tv

తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్‌రెడ్డికి స్వల్ప ఊరట

లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. పట్నం నరేందర్‌రెడ్డిపై నమోదైన 3 FIRలలో రెండు FIRలను హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఘటనలో తనపై మూడు FIRలు నమోదు చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు పట్నం నరేందర్‌రెడ్డి. దీనిపై విచారించిన హైకోర్టు..నరేందర్‌రెడ్డి లాయర్ వాదనలతో ఏకీభవించింది. మూడు FIRలలో రెండింటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

Exit mobile version