ఏపీలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. నాలుగు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మండిపడ్డారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. తప్పుడు కేసులు పెడుతున్నారని… లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. పారదర్శకత అన్నది ఎక్కడా లేదని నిలదీశారు. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతమని .. వీళ్లు చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారని విమర్శించారు.