స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 22 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ(Railway Department) తాజాగా ప్రకటించింది. ట్రాక్ మెయింటెనెన్స్(Track Maintenance) పనుల కారణంగా ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు పలు రూట్లలో 22 ఎంఎంటీఎస్(MMTS) రైళ్లను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ – ఫలక్ నుమా మధ్య నడిచే 6 సర్వీసులు, ఫలక్ నుమా – హైదరాబాద్6, ఉందానగర్ – లింగంపల్లి 3, లింగంపల్లి – ఉందానగర్ 2, రామచంద్రాపురం – ఫలక్ నుమా1, ఫలక్ నుమా– లింగంపల్లి2, ఉందానగర్ – ఫలక్ నుమా మధ్య నడిచే 2 సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


