20.7 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

హీరోయిన్ ఇలియానాకు అస్వస్థత

ప్రముఖ హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉన్నట్టుండి సడన్ గా వాంతులు కావడంతో బంధువులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆసుపత్రిలో ఉన్న ఫొటోను తనే షేర్ చేసి… ఒక కోట్ పెట్టింది.

‘‘ఒక రోజులో ఎన్నయినా మారవచ్చు. ఏదైనా జరగొచ్చు, మనం లేచి చూసేసరికి  మన కళ్లముందు కొందరు లవ్లీ డాక్టర్లు, కొన్ని ఫ్లూయిడ్స్ కనిపించవచ్చు’’… అని రాసుకొచ్చింది.

తర్వాత దానికి కొనసాగింపుగా…‘‘ నా ఆరోగ్యం గురించి చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. ఇంతమంది ప్రేమను పొందడం నిజంగా ఆనందంగా ఉంది. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నాను. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకున్నాను. అందుకు నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చిన మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరుండి చూసుకుంటున్న ఆసుపత్రి స్టాఫ్ కి కృతజ్నతలు’’ అని తెలిపింది.

ఇంతకీ ఎందుకు తను ఆసుపత్రి పాలైందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటంటే ఫుడ్ పాయిజినింగ్ కావడం వల్ల ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఇంతకీ తను రాత్రి ఏం తిన్నాదో చెప్పలేదని కొందరు రాస్తున్నారు. అసలు ఫుడ్ పాయిజినింగ్ కి కారణమైన వారిని వదలకూడదు అని కొందరు సీరియస్ అవుతున్నారు. ప్రస్తుతం ఇలియానా చేతిలో ‘‘ఫెయిర్ అండ్ లవ్లీ’’ ఒకే ఒక హిందీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అది రిలీజై…హిట్ అయితే తనకి మళ్లీ పూర్వపు రోజులు వస్తాయని ఆశపడుతోంది. అయితే ఎందుకు సౌత్ సినిమాల్లో ఇలియానాని బుక్ చేసుకోవడం లేదు. మొన్నటి వరకు కలల రాణిగా పేరున్న తను సడన్ గా షేడ్ అవుట్ కావడంపై రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి.

ఒకటేమో…హీరోయిన్ గా మంచి పీక్ లో ఉన్నప్పుడు ఒకతన్ని ప్రేమించి, ఆ పీకల్లోతు ప్రేమలో పడి కొత్త సినిమాలను వదిలేసుకుందనేది ఒక టాక్.

రెండు: జీరో సైజ్ నడుంతో ఉన్న ఇలియానా బాగా లావు అయిపోవడంతో నిర్మాతలెవరూ సాహసం చేయలేదని మరో టాక్. నిజానికి ఇలియానాకి నడుమే అందం…అదే పోయిందే! అని చాలామంది బాధపడ్డారు. తర్వాత తను ఎక్సర్ సైజ్ లు చేసి మళ్లీ జీరో సైజ్ కి వచ్చి, ఫొటోలకు ఫోజులిచ్చింది. కానీ నిర్మాతలు ముందుకు రాలేదు.

దానికి కారణం ఏమిటంటే సౌత్ ఇండియా సినీ నిర్మాతల మండలి ఇలియానాను ఎవరూ బుక్ చేసుకోవద్దని చెప్పడంతో ఆమె జోలికి వెళ్లడం లేదని ఒక నిర్మాత చెప్పారు.

విషయం ఏమిటంటే… తమిళ సినిమా కోసం రూ.40 లక్షలు అడ్వాన్స్ తీసుకుని… డేట్స్ ఇవ్వలేదని, తర్వాత నిర్మాత లబోదిబోమని మరొక హీరోయిన్ ని పెట్టుకుని సినిమా కంప్లీట్ చేశాడని సమాచారం. తన సినిమాలో నటించలేదు కాబట్టి, తిరిగి రూ.40 లక్షలు ఇవ్వాల్సిందేనని నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేశారు.

ఇలియానాని అడిగితే,  ఆ నిర్మాత వల్ల నా కాల్షీట్లు పోయాయి. ఇంకో సినిమా చేసేదాన్ని కదా…కావాలంటే మరో సినిమా చేస్తాను…అంతేగానీ డబ్బులివ్వను అన్నాదంట. దాంతో ఎవరు ఇలియానాని పెట్టి తీయాలన్నా…నిర్మాతల మండలి అడ్డుపడుతోంది. అందుకనే ఇలియానా సౌత్ వైపు కాకుండా బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టిందని సమాచారం.

ఏదో డబ్బులు వాడి ముఖాన కొట్టేసి, చక్కగా ఎప్పటిలా సౌత్ లో చేయవచ్చు కదా అని నెటిజన్లు కొందరు సలహాలు ఇస్తున్నారు.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్