MLA Balineni | ఏపీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినీరంగంలో పెట్టుబడుల ఆరోపణలపై స్పందించిన బాలినేని.. మైత్రీ సంస్థలో తనకు పెట్టుబడులున్నాయో? లేదో? పవన్ కల్యాణ్ దర్యాప్తు చేసుకోవచ్చనని అన్నారు. మైత్రీ మూవీస్ సినిమాల్లో తమకు పెట్టుబడులున్నాయన్న ఆరోపణలు సరికాదన్నారు. నాకు గాని, మా వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి గాని మైత్రీ మూవీస్ సినిమాల్లో రూపాయి పెట్టుబడి లేదన్నారు. ఒకవేళ ఎవరైన పెట్టుబడులు పెట్టినట్లు రుజువు చేస్తే మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తానని.. అంతేకాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌లో బాలినేనికి పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్ మూర్తి పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


