టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ మెరిట్ పాయింట్ కేటాయించారు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సహనం కోల్పోయారు. ఆసీస్ ఓపెనర్ కాన్‌స్టాస్ ఉద్దేశపూర్వకంగా భూజాలను తాకారు. దీంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు.