నన్ను ఇబ్బంది పెట్టినోళ్లకు వడ్డీతో చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తాను కేసీఆర్ బిడ్డనని.. తప్పు చేసే ప్రసక్తే లేదని అన్నారు.తనను అక్రమంగా, రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మాట్లాడిన కవిత.. తనకు కుటుంబానికి, తన పిల్లలకు దూరంగా ఇంత కాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగానికి గురయ్యారు. తన తప్పు లేకుండానే జైలులో వేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాననని శపథం చేశారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. తనను జైలుకు పంపించి జగమొండిని చేశారని కవిత అన్నారు. తనకు అండగా ఉన్న సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.