హైదరాబాద్‌లో పబ్స్ వ్యవహారం వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో గలీజ్ దందా మరోసారి బయటపడింది. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్‌లపై ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పబ్‌లో యువతులను ఏర్పాటు చేసి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెర లేపారని స్థానికులు అంటున్నారు. అర్ధరాత్రి వరకు డీజేలతో హోరెత్తిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని మండిపడుతున్నారు.
పబ్ లు ఎక్కువగా ఉండే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పబ్ ల వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇదే పబ్ ల విషయంలో నిర్లక్ష్యం వహించిన సిఐ నరేందర్ సస్పెండ్ అయ్యారు. అయితే ఎన్నికల ముందు వరకు పబ్బుల్లో దందాలు ఆపిన యాజమాన్యాలు.. ఎన్నికలు అయిపోయేసరికి మళ్లీ దందాలకు తెరలేపారని స్థానికులు మండిపడుతున్నారు.


