భార్య గర్భం దాల్చినపుడు తెలిసో తెలియకో కొన్ని పనులు చేస్తుంటారు. ఆలా చేస్తే.. భార్యకు అస్సలు మంచికాదని పండితులు చెబుతున్నారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు శాస్త్రం కొన్ని రకాల పనులు చేయకూడదని తెలిపిందని అంటున్నారు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త సముద్ర స్నానం చేయకూడదని చెబుతున్నారు. పచ్చటి చెట్లను నరకటం వలన పుట్ట బోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందని అంటున్నారు. భార్యన విడిచి సుదూర ప్రయాణాలకు వెళ్లడం లాంటివి చేయకూడదని చెప్తున్నారు. భార్య గర్భంతో ఉన్నప్పుడు గొడవలు పెట్టి.. ఆమెను కొట్టడం, దూషించడం లాంటివి అస్సలు చేయద్దని హెచ్చరిస్తున్నారు. ఆమె మనసు బాధపడితే పుట్టబోయే శిశువు ఆరోగ్యం క్షీణిస్తుందని అంటున్నారు. అలాగే భార్యకు 6 నెలల నుంచి డెలివరీ చేసే వరకు భర్త క్షౌరం చేసుకోకూడదని.. అంతేకాకుండా.. మరణించినవారి పాడే ముట్టకోవద్దని అంటున్నారు. మరణించిన వ్యక్తి శరీరం నుండి బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.. అది పుట్టబోయే శిశువుకు హాని చేస్తుందని ఈ నియమం పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే చనిపోయిన వారింటికి కూడా వెళ్లకూడదంటారు. భర్త దూర ప్రాంతాలకు వెళ్లడం, తీర్థయాత్రలు చేయడం లాంటివి చేయకూడదని సూచిస్తున్నారు.


