స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 100 ఎకరాలకు సంభందించిన వరి కుప్పలు దగ్ధం అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని రైతులు భావిస్తున్నారు. వరి కుప్పతొ పాటు పక్కనున్న మొక్కజొన్న తోటలో మంటలు వ్యాపించాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేయాలని బాధితులు వాపోతున్నారు.