ఎర్ర సముద్రంలో అమెరికా నౌక ‘పినోచియో’ను లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు.. తిరుగు బాటుదారులు క్షిపణులు ప్రయోగించినా అమెరికా నౌక దెబ్బతినలేదని, ఎవరూ గాయప డలేదని అమెరికా వెల్లడిం చింది. కాగా, అమెరికా-బ్రిటీష్ వైమానిక దాడుల్లో 11 మంది మృతిచెందారు. యెమెన్ కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో అమెరికా నౌక ‘పినోచియో’పై క్షిపణులతో దాడి చేశారని ఆ సంస్థ సైనిక ప్రతినిధి ప్రకటించారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో సింగపూర్ జెండా గల నౌకకు ముందు పేలుళ్లకు పాల్పడినట్లు తెలిపారు. ఎర్ర సముద్రంలో బాంబులు మోసుకెళ్లే 15 హౌతీ డ్రోన్లను అమెరికా నావికాదళం, విమానాలు కూల్చివేశాయని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా – బ్రిటన్ సంయుక్త దళాలు పశ్చిమ యెమెన్ లోని ఓడరేవు నగరాలు, చిన్న పట్టణా లపై జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది చనిపోయారు. 14 మంది గాయపడ్డారని యెమెన్ వెల్లడిం చింది.


