26 C
Hyderabad
Friday, February 27, 2026
spot_img

కౌశిక్ రెడ్డి, ప్రణవ్‌ల హౌస్ అరెస్ట్

కరీంనగర్ జిల్లా వీణవంకలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వీణవంక నుంచి చెల్పూర్‌కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. తడి బట్టలతో తాను అవినీతి చేయలేదని కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. 100 కోట్ల అవినీతి చేయలేదని ప్రమాణం చేయాలన్నారు. తాను అవినీతి చేయలేదని దేవుడిపై ప్రమాణం చేస్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. ఫ్లైయాష్‌తోపాటు ఓవర్ లోడ్ లారీలను ఎందుకు ఆపడం లేదన్నారు. ఓవర్ లోడ్ లారీల నుంచి ఒక్క రుపాయి తీసుకోలేదని పొన్నం ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చేప్తానన్నారు.తాను ఎలా నిజాయితీని నిరుపించుకున్నానో అలాగే పొన్నం నిరూపించు కోవాలన్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కౌశిక్ రెడ్డి, ప్రణవ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్