ఢిల్లీలో జగన్‌ది సినిమా సిట్టింగేనని… అసెంబ్లీని ఎగ్గొట్టాలనే జగన్ ఢిల్లీ వెళ్లి డ్రామాలాడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. రాజకీయ పార్టీలకు సిద్దాంతాలు ఉంటాయని…. కానీ వైసీపీకి మాత్రం ఫేక్ రాజకీయం.. ఫేక్ ప్రచారం మాత్రమే సిద్దాంతమని ఆరోపించారు. వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకు పరిమితమైందని విమర్శించారు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలనే ధర్నాలు చేస్తున్నారని… గతంలో ప్రతిపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఢిల్లీ వెళ్లి మరీ ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ రెడ్ బుక్ అంటే భయపడుతున్నాడని.. హస్తినలో కూడా రెడ్‌బుక్ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష సభ్యుడుగా హుందాగా వ్యవహరించాలని తెలిపారు.


