స్వతంత్ర వెబ్ డెస్క్: హోంగార్డులను పోలీసు అధికారులు పని మనుషుల్లా వాడుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకోలేదని.. ప్రభుత్వమే హత్య చేసిందన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డులను ప్రభుత్వం రెగ్యులర్ చేసి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రవీందర్ కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. అతడి భార్య సంధ్యకు తగిన న్యాయం చేయాలని అయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.