నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న లేటెస్ట్ మూవీ హిట్ 3. ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. హిట్ మూవీ సక్సెస్ తర్వాత హిట్ 2 తీస్తే.. అది కూడా విజయం సాధించింది. దీంతో ఇప్పుడు హిట్ 3 రూపొందిస్తున్నారు. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో అర్జున్ సర్కార్ గా నటిస్తున్నాడు. ఈరోజు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా హిట్ 3 టీజర్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ విషయానికి వస్తే.. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ ను చూస్తే తెలుస్తోంది. థ్రిల్లర్ మూవీ అంటే.. వరుసగా హత్యలు జరగడం.. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారో కనిపెట్టడం. ఇది కూడా అలాగే అనిపిస్తున్నప్పటికీ.. అర్జున్ సర్కార్ క్యారెక్టర్.. డైరెక్టర్ శైలేష్ కొలను టేకింగ్, మేకింగ్ స్టైలీష్ గా ఉన్నాయి. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ భారీ థ్రిల్లర్ మూవీని మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. హిట్, హిట్ 2 వలే.. హిట్ 3 కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.