స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ కాంగ్రెస్ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అంగీకరించినా.. శివకుమార్ అభ్యంతరం చెప్పారు. దీంతో వారిద్దరిని రేపు ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్ ఆదేశించింది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వారు సమావేశం కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఈనెల 18న సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరగనుంది.
అంతకుముందు బెంగళూరులోని షింగ్రిల్లా హోటల్ లో సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ శిందే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, ఏఐసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా హాజరై ఎమ్మెల్యేల అభిప్రాయాలు స్వీకరించారు.