తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలతోపాటు అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ముసురుతో పాటు.. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం గంటపాటు వర్షం దంచికొట్టగా, ఇవాళ తెల్లవారుజామున కూడా హైదరాబాద్ అంతటా చిరుజల్లులు కురిశాయి. చాలాచోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.