స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, సికింద్రాబాద్, యూసుఫ్ గూడ, ఎస్ ఆర్ నగర్, మియాపూర్, అంబర్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. మరోవైపు వర్షాలపై మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమీక్ష నిర్వహించారు.


