కొన్నిరోజులుగా భానుడి ప్రతాపంతో సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, మైత్రీవనం, బేగంపేట, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైకోర్టు, నాంపల్లి, గోషామహల్, బేగంబజార్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. దీంతో పలు చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. అయితే చల్లటి గాలులతో కూడిన వాతారణాన్ని నగరవాసులు ఆస్వాదిస్తున్నారు.