26.2 C
Hyderabad
Friday, February 20, 2026
spot_img

దుబాయ్‌లో మళ్లీ భారీ వర్షాలు

       ఎడారి దేశం దుబాయ్‌ను మరోసారి వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను అధికారు లు రద్దు చేశారు. ఎండలతో ఉక్కిరిబిక్కిరయ్యే ఎడాది దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. గత నెలలో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టి వణికించగా.. తాజాగా మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరాన్ని వరద ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్త మయ్యింది.

బుధవారం రాత్రి నుంచి యూఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. దుబాయ్, అబుదాబీతో పాటు పలు నగరాల్లో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తు న్నాయి. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. భారత్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేశాయి. దుబాయ్‌, షార్జా, అబుదాబీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తమ విమాన సేవలకు ఆటంకం కలుగు తోందని తెలిపాయి. ఎయిర్‌పోర్టులకు బయల్దేరేముందు మీ విమాన స్టేటస్‌ను చెక్‌ చేసుకోండి అంటూ ప్రయాణికులను కోరుతున్నాయి.

      గత నెల ఏప్రిల్‌ 14,15 తేదీల్లో దుబాయ్‌ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దుబాయ్‌ నగరంలో ఏడాది న్నరలో నమోదయ్యే వర్షపాతం. కొన్ని గంటల్లోనే కురిసింది. 1949 తర్వాత గత నెలలోనే దుబాయ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై నట్లు అధికారులు తెలిపారు. తాజా వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తు న్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్