స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు(heavy rains) పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(North Telangana), కోస్తాంధ్ర(Coastal Andhra), ఉత్తరాంధ్ర(Uttarandhra) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన వాతావరణమే దీనికి కారణంగా తెలుస్తోంది.
వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. దట్టమైన మేఘాలకు బలమైన గాలులు తోడవడంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. అటు ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా మేఘాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
ఏపీలో విజయవాడ, పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలోని వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు రావచ్చు. ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాల్లో చిరు జల్లులు లేదా మోస్తరు వర్షాలు పడవచ్చు. రాత్రికి ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు ప్రారంభం కావచ్చు.


