స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ రాజధానిలో భారీ భూకంపం సంభవించింది. పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించగా.. జనం ఇళ్ల నుంచి భయంతో బయటికి పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.2గా నమోదు అయింది. భూకంప కేంద్రం నేపాల్ కి సమీపంలో ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి స్పష్టం చేసింది.
ఢిల్లీతో సహా పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో దాదాపు 40 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 2.26 నిమిషాలకు భూమి కంపించినట్టు సమాచారం. కార్యాలయాలు, ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికీ పరుగులు తీశారు. ఢిల్లీలో ఇవాళ రెండు సార్లు భూప్రకంపనలు సంభవించాయి. తొలుత ఆప్గానిస్తాన్ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. రెండోసారి నేపాల్ భూకేంద్రంగా రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.