లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జూన్ 19న విచారణ చేపడతామని ఢిల్లీ కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో సమాధానం ఇచ్చేందు కు సమయం కావాలని ఈడీ కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముకేష్ కుమార్ ఈ కేసు విచారణను వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా ఈ కేసును జూన్ 25కి వాయిదా వేయాల్సిందిగా ఈడీ జడ్జిని కోరింది. దీంతో జూన్ 19న విచారణ చేపతామని కోర్టు పేర్కొంది. అయితే నిందితుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున తదుపరి విచారణ సమయంలో ఆయన వివరణను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జి స్పష్టం చేశారు. అలాగే, కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి, చికిత్సను నిర్థారించేందుకు నియమించిన మెడికల్ బోర్డ్ చర్యల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన భార్యను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను రేపటికి వాయిదా వేశారు. దీనిపై స్పందించాలని సంబంధిత జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.


