ఢిల్లీలో లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణ ఈ నెల 7కు వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎల్లుండి తుది వాదనలు వింటామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కవితను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను గతంలోనే ట్రయల్ కొట్టి వేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడా నిరాశే ఎదురైంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావు, జగదీష్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ కానున్నారు.