సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరారు. దీంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల ఆయన్ను అరెస్ట్ అయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో ఇవాళ ఆయన వర్చువల్‌గా న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. మరోవైపు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో విచారణనూ నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది. అల్లు అర్జున్ రిమాండ్‌పైనా విచారణ సోమవారమే జరగనుంది.