స్వతంత్ర వెబ్ డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ వివేకా కూతురు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో సునీత స్వయంగా వాదనలు వినిపించారు. అవినాష్‌కు తెలంగాణ హై కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలనీ కోరారు. ఆమె వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
సీనియర్ల లాయర్ల వాదనలను వినబోమని కోర్టు చెప్పడం వల్ల తన కేసును సునీతారెడ్డి తానే వాదించుకున్నారు. సీనియర్ లాయర్ల వాదనలు విననందున సీబీఐకి నోటీసులు జారీచేసే విషయాన్ని ధర్మాసనం పట్టించుకోలేదు. అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేయడానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సునీత ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తులు జస్జిస్ విక్రమ్‌నాథ్, జస్జిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది.