Health Tips |ఎంతకాలం బతికామన్నది కాదు.. బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. గతంలో వృధాప్యంలో మాత్రమే వచ్చే జబ్బులు నేటి ఆధునిక కాలంలో యుక్త వయసులోనే వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మంది బాధపడే దీర్ఘకాలిక వ్యాధుల్లో మధుమేహాం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. ముఖ్యంగా జీవనశైలిలో వస్తున్న మార్పులే ఈ ఆరోగ్య సమస్యలకు కారణంగా తెలుస్తోంది. అయితే ఆరోగ్యకర జీవితం కోరుకునే వారు తగినంత పోషకాహారాలు తీసుకోవాలి. మన శరీరానికి శక్తినిచ్చేవి పోషకాహరాలే. చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. నేటి బిజీ షెడ్యూల్ లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునేవారి సంఖ్య తగ్గుతుంది. డ్రైఫ్రూట్స్ తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.
Health Tips |అయితే వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సినవి వాల్ నట్స్. వీటిని రోజూ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న వాల్ నట్ లు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో వాల్ నట్స్ ను డ్రై ఫ్రూట్స్ లో రారాజుగా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఉదయం పరగడుపునే తినడంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రెండు వాల్ నట్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినాలి. వాల్ నట్స్ ను అక్రోట్ అని కూడా పిలుస్తారు. వాల్ నట్స్ తో మధుమేహని నియంత్రించవచ్చు. అలాగే అరుగుదలకు కూడా ఇవి ఉపయోగపడతాయి. ఎముకలు గట్టిపడటంతో పాటు.. గుండె ఆరోగ్యానికి కూడా వాల్ నట్స్ మంచివి. వాల్ నట్స్ తో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కోవిడ్ సమయంలో డ్రైఫ్రూట్స్ కు విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. డ్రైఫ్రూట్స్ తినడం అలవాటు లేని వాళ్లు కూడా వాటిని తినడం అలవాటుచేసుకోవడానికి ముఖ్య కారణం. డ్రైఫ్రూట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే శక్తి ఉండటమే. ఈ డ్రైఫ్రూట్స్ లో కూడా వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వ్యక్తిలోని రోగనిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. అనేక వ్యాధుల నుంచి వాల్ నట్స్ రక్షణ కల్పిస్తాయి. ఆరోగ్యంగా, ధృడంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారంలో నానబెట్టిన వాల్ నట్స్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది.
జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది
వాల్ నట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాల అవసరం. రోజూ తగిన మోతాదులో వాల్ నట్స్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది.