23.2 C
Hyderabad
Tuesday, December 3, 2024
spot_img

Murder In Bangalore | 16సార్లు కసి తీరా పొడిచాడు.. నిందితుడికి నెటిజన్ల సపోర్ట్

Murder In Bangalore | ప్రేమోన్మాది చేతిలో మరో యువతి దారుణ హత్యకు గురైంది. ఒళ్లు గగ్గోరుడిపించే ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కాకినాడకు చెందిన లీలా పవిత్ర.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ల్యాబులో పనిచేస్తోంది. అదే ఆఫీస్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరి పెళ్లికి లీలా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో యువతి రెండు నెలల నుంచి దివాకర్ కు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే లీలాకు మరో యువకుడితో పెళ్లి కుదిరిందనే విషయాన్ని తెలుసుకున్న దివాకర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు.

Murder In Bangalore  |మంగళవారం రాత్రి విధులు ముగించుకుని బయటకు వస్తున్న లీలాపై ఆఫీస్ బయటే అందరి ముందు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె శరీరంపై 16చోట్ల కత్తితో పొడిచిన గాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన బెంగళూరు బయలుదేరారు. సెలవుల నిమిత్తం కాకినాడ వచ్చిన లీలా నాలుగు రోజుల క్రితమే బెంగళూరు వచ్చినట్లు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

అయితే మోసం చేసిన యువతిని చంపడాన్ని కొంతమంది యువకులు సమర్థించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐదు సంవత్సరాల పాటు ప్రేమించి ఇప్పుడు ఏం తెలియనట్లు వేరే వాడితో పెళ్లికి సిద్ధమవ్వడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. ఇటువంటి యువతుల వల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వెల్లడిస్తున్నారు.

Read Also: ఇదేంట్రా బాబు.. రూ.350 కోసం కత్తులతో దాడి

Latest Articles

కంట్రీక్లబ్‌.. వెల్‌కమ్‌ వేడుకలు షురూ..

కంట్రీ క్లబ్‌ అందరికన్నా ముందుగా న్యూ ఇయర్‌ బాష్‌కి వెల్‌ కమ్‌ చెప్పింది. కంట్రీక్లబ్‌ హాస్పిటాలిటీ అండ్‌ హాలిడేస్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఆసియాలోనే అత్యంత భారీ స్థాయి నూతన సంవత్సర వేడుకలను ’వార్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్