స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రస్తుతం పుత్రోత్సాహం అనుభవిస్తున్నారు. ఆయన తనయుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పట్టా అందుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ స్నాతకోత్సవం కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అర్చిష్మాన్ గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్ మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. దీంతో హరీశ్ రావు తన కుమారుడిని చూసి ఆనందంతో పొంగిపోయారు. మా అబ్బాయి సాధించిన అద్భుతమైన ఘనత పట్ల తండ్రిగా గర్వించకుండా ఎలా ఉండగలను అంటూ ట్వీట్ చేశారు. ఈ అమోఘమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా తనకు అభినందనలు చెబుతానని పేర్కొన్నారు.