Happy Valentine’s Day 2023: Wishes Images, Quotes, Status, Messages, Greetings and Photos:
ప్రేమికుల దినోత్సవం ముందు రోజు…
అబ్బాయిలందరూ అందమైన గ్రీటింగ్ కార్డులు, బ్యాండ్లు, కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇచ్చేందుకు తెగ తంటాలు పడుతున్నారు. అయితే ఏం కొనాలని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. రాత్రి నుంచి మందేసి మరీ తెగ ఆలోచించేస్తున్నారు. కొందరు గుప్పుగుప్పుమని సిగరెట్లు కాల్చేస్తున్నారు. ఐడియాలే రావడం లేదు.
ఏదొకటి ఇచ్చేస్తే…వీడికి టేస్టే లేదు అనుకుంటుందేమోననే బెంగ,
ఒకవేళ తక్కువ స్థాయిది కొంటే…రేపు పెళ్లయ్యాక కూడా ఇలానే కొనిస్తాడా? అనుకుంటుందేమోనని కంగారు,
అదీ ఇదీ కాదు…డైరక్టుగా చెప్పేద్దాం అనుకుంటే, ఎక్కడ పుసుక్కున ‘నో’ చెప్పేస్తోందోననే భయం…
ఇలా కాదు…వాట్సాప్ లో మెసేజ్ చేద్దాం…అనుకుంటే…తీరా చూడకపోతే,
చూసిం తర్వాత రిప్లై ఇవ్వకపోతే, అసలు మాట్లాడకపోతే…
వీడేంటి ఇలా రాశాడని అనుకుంటే, మనపైన బ్యాడ్ బోయ్ ముద్ర వేసేస్తే…
రేపు పొద్దున్నే కనిపించి…
‘దినేష్’ నువ్విలాంటోడివి అనుకోలేదని అంటే…
నువ్విన్నాళ్లు మంచివాడివి అనుకున్నాను…నీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉందా? ఛీ అని ఛీకొడితే…
అబ్బబ్బా…బుర్ర బద్దలైపోతోంది రా…బాబూ…అనుకుంటూ రాత్రి అంతా పెగ్గు మీద పెగ్గు మీద వేసి, పొద్దున్న చూసుకుందాంలే…తను కాకపోతే మరొకరు అని మనసుకి సర్దిచెప్పుకుని పడుకుంటే…ఎంతసేపటికీ నిద్ర పట్టదే…
ఏటిరా..ఈ ఖర్మ మన రాష్ట్రానికి అన్న చంద్రబాబులా…ఏంట్రీ ఈ ఖర్మ నా జన్మకి అని అనుకునే స్థితికి దిగజారిపోయే పరిస్థితి…
సరే, మొన్న కాంచన ఏమంది? నువ్వు సిగరెట్ కాలుస్తావా? అని అడిగింది. అందులో తప్పేం ఉంది? అన్నాడు…
సీరియస్ గా తల దించుకుని వెళ్లిపోయింది. ఇదంతా చూస్తున్న నా ఫ్రెండ్ ఏమంటాడంటే…
ఒరేయ్…నీకిష్టమైన అమ్మాయి కావాలని…నువ్వేమో తనవైపు చూస్తున్నావ్, తనేం అనుకుంటుంది…తనకి ఇష్టమైనట్టు నువ్వు ఉండాలని అనుకుంటుంది. అంటే తనకోసం నువ్వు సిగరెట్ మానేయాలి, మందు మానేయాలి, నాలాంటి వెధవ ఫ్రెండ్స్ ని కలవకూడదు…
అనగానే తనిలా చూశాడు.
అదేరా…అంటే నీ కాంచన దృష్టిలో అన్నమాట…రేపు తను నీకు ‘ఎస్’ చెప్పగానే…
ఫ్రెండ్స్ తో తిరగొద్దు అని ఫస్ట్ కండీషన్ పెడుతుంది చూడు…
ఇక అప్పటి నుంచి నీకు మేం ఉండం…అంటే ఇప్పటి నుంచే తను నిన్ను హోల్డ్ చేస్తుందన్నమాట.
తనొక చిన్న పిల్ల, చంటి పాపాయిలా గారాబం చేస్తూ, అమ్మా చిట్టి, పొట్టి, అని బతిమలాడుతూ ఉండాలి. అప్పుడే తనంటే, నువ్వు పడి చచ్చిపోతున్నావ్ అనుకుంటుంది.
అని ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాడు.
మరి రాత్రంతా జుత్తు పీక్కొని రాసిన మనవాడి మొదటి ప్రేమలేఖ..సంగతేమిటి? అని మిగిలిన స్నేహితులు అడిగితే…
బిక్కచచ్చిపోయి చూస్తున్న దినేష్ పరిస్థితిని మీరే ఊహించుకోవచ్చు.
అంటే ఒకప్పుడు అంటే మీకు పవన్ కల్యాణ్ సినిమా గురించి చెబితే అర్థమవుతుంది. అంటే ఆ సినిమా రోజుల్లో అన్నమాట…
ఆ సినిమా పేరు ‘సుస్వాగతం’ అన్నమాట…
అందులో ఇలాగే పవన్ కల్యాణ్ కాలేజీలో చేరిన మొదటి రోజే ఒకమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఒక లెటర్ రాస్తాడు. అది పట్టుకుని తిరుగుతుంటాడు. మూడేళ్లు అయిపోతుంది. లెటర్ ఇవ్వలేడు. చివరికి ప్రేమించే ఆడవాళ్లకి, ప్రేమించలేని ఆడవాళ్లకి, ప్రేమ పేరుతో మగవాళ్లని తమ వెంట తిప్పుకునే వారికి ఒక క్లాస్ పీకుతాడు.
ఇప్పుడంత లేదు. నువ్వంటే ఇష్టమా? లేదా? అయితే ముందుకెళదాం…లేకపోతే ఆగిపోదాం…అని చాలామంది సాఫ్ట్ వేర్ కుర్రగాళ్లు చెబుతున్నారు గానీ…
ప్రేమ కోసం బాధపడేవారు, తపించేవారు…ఆరాధించేవారికి ఇంకా కొదవలేదు. అందుకు ఉదాహరణ… ప్రేమికుల దినోత్సవానికి రోజురోజుకి క్రేజ్ పెరిగిపోవడమే..
అందుకే ప్రేమ నిత్యనూతనం…
ప్రేమ చిర స్మరణీయం…
ప్రేమ…ఒక మధురం…
అది ఒక జీవితకాలానికి
సరిపడా అనుభూతినిచ్చే ప్రేమకావ్యం