- వ్యాలంటైన్స్ డే కి ప్రేమికులకు గిఫ్టులు
- ఫిబ్రవరి 14 నాడే తెరమీదకు కొత్త వాదన
- ఆవులను కౌగిలించుకోవాలని, గోమాతలను పూజించాలన్న వాదన
- అనేక చోట్ల గో పూజలు
- వ్యాలంటైన్స్ డే ను వ్యతిరేకించాలన్న వాదన
- భారతీయ సంస్క్రతిలో వ్యాలంటైన్స్ డేకి చోటే లేదన్న భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్

హైదరాబాద్: ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే అని అందరికీ తెలిసిందే. గ్లోబలైజేషన్ తర్వాత కాలంలో ఇటువంటి వేడుకలు బాగా ఊపందుకొన్నాయి. వ్యాలంటైన్స్ డే కి ప్రేమికులకు గిఫ్ట్ లు అందించుకోవటం, హుషారు చేయటం కొత్త ట్రెండ్ గా నిలుస్తోంది. దీనిని ఉపయోగించుకొనేందుకు చాలా షాప్స్, మాల్స్ లో ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అలాగే టూరిజం ప్లేసెస్ లో కూడా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఇదంతా బహుళ జాతి సంస్థల కుట్ర అన్న వాదన కూడా అంతే బలంగా వినిపిస్తోంది. వ్యాపారాలు పెంచుకొనేందుకు చేస్తున్న హంగామా అన్న ఆరోపణ వినిపిస్తోంది.

మరో వైపు ఇదే ఫిబ్రవరి 14 నాడే కొత్త వాదన తెర మీదకు వచ్చింది. ఆవులను కౌగిలించుకోవాలని, గోమాతలను పూజించాలన్న వాదన తెర మీదకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా అనేక చోట్ల గో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరో వైపు, వ్యాలంటైన్స్ డే ను వ్యతిరేకించాలన్న వాదన కూడా బలపడుతోంది. భారతీయ సంస్క్రతిలో ఇటువంటి వాటికి చోటే లేదని భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. వ్యాలంటైన్స్ డే వంటి కల్చర్ తో మనదైన సంస్కృతి దెబ్బతింటోందని వాదిస్తున్నాయి.