స్వతంత్ర వెబ్ డెస్క్: స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న చంద్రబాబును డిఫెండ్ చేయడానికి టీడీపీ సీనియర్ల బలం సరిపొవట్లేదని చెప్పాలి. ఒకవైపు వైసీపీ నేతలు చంద్రబాబు అవినీతి పరుడు అని ప్రజలకు చెప్పడంలో ఒకింత సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. ఇక తాజాగా టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, చంద్రబాబును ఆయన కుటుంబాన్ని నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైసీపీపై కన్నెర్ర చేశారు. వైసీపీ నేతలు అంతా కూడా సీఎం జగన్ మెప్పు మరియు పదవుల కోసం వెంపర్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ప్రత్తిపాటి. నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతున్న కొడాలి నానిని పిచ్చాసుపత్రికి పంపించాలంటూ, పిచ్చి కూతలు కూసే ఆనాలుక మీద వాతలు పెడతామని హెచ్చరించారు ప్రత్తిపాటి పుల్లారావు. వైసీపీలో ఉన్న గుట్కా మట్కా క్యాసినో బ్యాచ్ లకు చంద్రబాబు గొప్పతనం గురించి అర్ధం కాదు అంటూ ఆయనను వెనకేసుకొచ్చారు.