Pulivendula | కడప జిల్లా పులివెందులలో కాల్పుల కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డారు భరత్ అనే వ్యక్తి. ఈ కాల్పుల్లో దిలీప్, బాషా అనే వ్యక్తులకు బుల్లెట్ల గాయాలు అయ్యాయి. మొత్తం మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దిలీప్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. మరో వ్యక్తి బాషాను పులివెందులలోని ప్రభుత్వ ఆసుపతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్ యాదవ్ ను ఇదివరకు మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. కాగా, కాల్పులు జరపడానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా
Follow us on: Youtube, Instagram, Google News