స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై గురువారం భద్రాచలంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 7 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమై ఉదయం 8.30 గంటలకు భద్రాచలానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకొని రామయ్యకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీకృష్ణమండలంలో ఏర్పాటు చేసే హెల్త్ అవేర్‌నెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గిరిజన అభ్యుద భవన్‌లో గిరిజనులతో ఆమె ముఖాముఖి కార్యాక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమానంతరం తిరిగి హైదరాబాద్ కి బయల్దేరుతారు. గవర్నర్ పర్యటన సందర్బంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్యటనా ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి.. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.