స్వతంత్ర వెబ్ డెస్క్: వారాహి యాత్రలో ఏ దాడి జరిగినా జగన్ ప్రభుత్వానిదే బాధ్యత అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. కృష్ణా జిల్లాలో జరిగిన జనవాణి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జన సైనికులపై రాళ్ల దాడి చేసినా.. క్రిమినల్ ఎటాక్ చేసినా ఏం చేసినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రలకు విఘాతం కలిగితే డీజీపే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
సీఎం జగన్ పులివెందుల మైండ్ సెట్ ఇక్కడ చూపిస్తే ఊరుకోం. ఎవరైనా జేబులోంచి ఏమి తీసినా చుట్టూ పక్కల మద్దతుదారులు వారిని బందించండి అని జన సైనికులకు సూచించారు పవన్ కళ్యాణ్. పెడనలో వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. అమలాపురం మాదిరిగా గొడవలు సృష్టించాలని కుట్ర పనుతున్నారని పేర్కొన్నారు. దాడులు చేయడానికి మూడు వేల మంది వరకు వస్తారు. జన సైనికులు వారిపై ఎదురుదాడికి దిగవద్దు. దాడి చేసే వాళ్లు కత్తు, రాళ్లు తీస్తే.. వారి కాళ్లు, చేతులు కట్టేయండి అని తెలిపారు.