స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీలోని పేద విద్యార్ధులకు చదువు కోసం అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్ధికసాయం చేస్తూ అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదిలో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన కింద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.
ఏపీ సీఎం జగన్ రేపు (ఆగస్టు 28) చిత్తూరు జిల్లా నగరిలో పర్యటించనున్నారు. నగరిలో భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి నిధులు బదిలీ చేయనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు. నగరి మంత్రి రోజా సొంత నియోజకవర్గం కావడంతో సీఎం జగన్ కు అదిరిపోయే రీతిలో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో అందరి దృష్టి సీఎం జగన్ నగరి పర్యటనపై పడింది.