స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇవాల్టి నుంచి దసరా, బతుకమ్మ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో మొన్నటి వరకు పరీక్షలు ముగిశాయి. నిన్న స్కూల్స్, కాలేజీలలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలతో స్కూళ్లు, కాలేజీలకు తరలి వచ్చారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఆడుకున్నారు. ఇవాళ్టి నుంచి దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ ఊళ్లకు బయలుదేరారు. దీంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. అయితే.. దసరా సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవును 23, 24కి మార్చేసింది.