25.2 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి. శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఆందోళనకు దారితీస్తుంది. మానసికంగా, శారీరకంగా కృంగిపోతే.. మాయదారి రోగాలకు లొంగిపోయినట్టే లెక్క. ఇక..ఆసుపత్రిలో అడుగెడితే…అది కార్పొరేట్ ఆసుపత్రి అయితే…కోట్లకు పడగలెత్తిన వ్యక్తి సైతం కూటి కోసం అల్లాడే సామాన్యులుగా మారిపోవడం ఖాయమని.. ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

కొండనాలుక మందు..ఉన్న నాలుక లాగేసినట్టు… టెస్ట్ లని, రెస్ట్ లని, రూమ్ లని, మందులని, ఇంజక్షన్లని, ఆపరేషన్లని, అవయవాల సెపరేషన్లని…నానా హంగామాలు చేసి నిలువుదోపిడీ చేయడం ఆసుపత్రుల ముఖ్యవిధుల్లో ఒకటిగా మారిపోయింది. బేర్ మనిపెంచే ఖర్చులతో ఇన్సెంటివ్ కేర్ లలో పెట్టి..దోపిడీల పర్వం, ప్రాణాలు పోయినా.. బతికున్నట్టు, ట్రీట్ మెంట్ చేస్తున్నట్టు చెప్పి.. చెరుకు పిప్పి మాదిరి పీల్చి పిప్పి చేశాక..అప్పడు..సారీ.. మా ప్రయత్నం ఫలించలేదని.. ఇంటికెళ్లి నోట్ల కట్టలు లెక్కెట్టుకోవడం.. ఈ తంతులు చాలా ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి.

రోగాలను దరిచేరనీయకుండా చేసేది వ్యాయామం. వ్యాయామంలో ముందు భాగాన నిలిచేవి క్రీడలు. ఆటలకు అగ్రస్థానం ఇస్తే.. ఆరోగ్యకర సమాజానికి ఊతం ఇచ్చినట్టే. గ్రామీణ క్రీడలు, సంప్రదాయ క్రీడలు, క్రికెట్, ఫుట్ బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర అవుట్ డోర్ గేమ్స్ తో పాటు ఎన్నో ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. క్రీడా సంస్కృతి ఉత్తమ సంస్కృతుల్లో ఒకటిగానే భావించవచ్చు. హైదరాబాద్ మహానగరంలో అట్టహాసంగా టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ప్రారంభం అయ్యింది. గోల్ఫ్ క్రీడను ప్రమోట్ చేసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఆరో రియాల్టీ టీ9 ఛాలెంజ్ మూడో సీజన్ బౌల్డర్ హిల్స్ గోల్ఫ్, కంట్రీ క్లబ్‌ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్‌లో 16 జట్ల నుంచి 128 మంది గోల్ఫర్లు పాల్గొంటున్నారు. 24 రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌ల్లో క్రీడాకారులు ఆడనున్నారు.

ప్రతిష్టాత్మక ఈ టోర్నమెంట్ తెలంగాణలో గోల్ఫ్‌ క్రీడకు సంబంధించి మరింత పోటీతత్వాన్ని పెంచబోతోందనీ టీగోల్ఫ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి చెప్పారు. టీ9 ఛాలెంజ్ గోల్ఫింగ్ ప్రతిభను ప్రదర్శించడానికి, భవిష్యత్ ఛాంపియన్లను తయారుచేయడానికిఒక కీలకమైన వేదికగా పనిచేస్తుందనీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వి. చాముండేశ్వరనాథ్ చెప్పారు. టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఆరో రియాల్టీ మార్కెటింగ్ హెడ్ సిద్ధార్థ్ మాల్, సేల్స్ హెడ్ శ్రీ పునీత్ కుమార్‌ లను టీ గోల్ఫ్ ఫౌండేషన్ తరపున సత్కరించారు.

పూల్ ఏ లో నోవోటెల్, ఐరా లయన్స్, టూటరూట్, బంకర్ బస్టర్స్ చోటు దక్కించుకున్నాయి. పూల్ బి లో కైన్ డైరీ, బాష్ ఆన్, గోల్కొండ గాలంట్ గోల్ఫర్స్, ఫెయిర్వే ఫాల్కన్స్ చోటు పొందాయి. పూల్ సీలో సెమెట్రిక్స్, లావిస్టా క్రూసేడర్స్, పార్-ఫెక్షనిస్ట్స్, వాంటేజ్ వారియర్స్ స్థానం పొందాయి. పూల్ డిలో ఎఫ్జీ వారియర్స్, శ్రీనిధి డెక్కన్ వారియర్స్, సమ్మర్ స్టార్మ్, ఆరో వారియర్స్ చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలో గోల్ఫ్‌ క్రీడాభివృద్ధికి ఈ టోర్నీ దోహదం చేయడం ఖాయమని క్రీడాభిమానులు స్పష్టం చేస్తున్నారు.

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్