స్వతంత్ర వెబ్ డెస్క్: ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతు తన సేవలను రద్దు చేసిన ‘గో ఫస్ట్ ఎయిర్ లైన్స్’ విమాన సర్వీసుల రద్దును మరింత పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆపరేషనల్ రీజన్స్ కారణంగా మే 30 వరకూ సర్వీసుల సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించామని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తమ వెబ్ సైట్ లో అప్ డేట్ చేసారు. అయితే మే 30వరకు టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు త్వరలోనే రిఫండ్ చేస్తామని కంపెనీ అధికారులు వడ్డించారు. తక్షణ పరిష్కారం, కార్యకలాపాల పునరుద్ధరణ కోసం కంపెనీ ఒక దరఖాస్తును దాఖలు చేసినందని త్వరలోనే బుకింగ్‌లు ప్రారంభిస్తామనే ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే విమాన సర్వీసులు పునః ప్రారంభానికి సంబంధించి.. సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయి, పైలట్లు, ఇతర సిబ్బంది లభ్యత, నిర్వహణ వసతులు, నిధులు, మూలధనం, విమానాల అద్దె సంస్థలు, వెండర్లతో ఒప్పందాలు వంటి వివరాలను ప్రణాళికలో పొందుపరిచి 30రోజుల్లోగా తమకి సమర్పించాలని గో ఫస్ట్‌ను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మే 24న ఆదేశించింది.పునరుద్ధరణ ప్రణాళిక రూపకల్పన కోసం మారటోరియం సమయాన్ని ఉపయోగించుకునేందుకు ఇనుమతివ్వాలని డీజీసీఏను గోఫస్ట్ కోరింది. గోఫస్ట్ మే 3వ తేదీ నుంచి విమాన సర్వీసులను ఆపేసింది. స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. అకస్మాత్తుగా విమాన సర్వీసుల నిలిపివేతపై గో ఫస్ట్‌కు డీజీసీఏ నోటులు పంపగా, 8న గోఫస్ట్ వివరణ ఇచ్చింది.


