36.1 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి… ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే మధ్యాహ్నాం ఒంటి గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. కస్టడీ పిటిషన్ తర్వాతనే మిగిలిన పిటిషన్లపై విచారణ చేపడతామని వెల్లడించారు. స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును మరింత విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ పిటిషన్‌లో తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ఐదు రోజులు కస్టీడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మరికాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్